ఏకగ్రీవాల పేరుతో బెదిరింపుల రాజకీయం: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హైడ్రామా
మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపుల రాజకీయానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో ఇదే తరహా పరిస్థితి నెలకొందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు, బెదిరింపులు, రాజకీయ డ్రామాలు చోటు చేసుకున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్లు వేసే పరిస్థితి కూడా లేకుండా, ముందే ఏకగ్రీవాల పేరుతో ఫలితాలను ఖరారు చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా “80 శాతం ప్రజాభిమానము కాంగ్రెస్‌కే ఉంది”…

