షేక్పేట్ ప్రజల ఆవేదన – 15 ఏళ్లుగా పరిష్కారం లేని డ్రైనేజ్ సమస్యపై ఫిర్యాదులు ఫలించలేదు
హైదరాబాద్ నగరంలోని షేక్పేట్ ప్రాంత ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చెబుతున్న ప్రకారం, వర్షం వచ్చినప్పుడల్లా నీరు ఇళ్లలోకి ప్రవేశించి జీవనాన్ని దెబ్బతీస్తోంది. డ్రైనేజ్ నీరు వీధులంతా వ్యాపించి దోమలు, రోగాలు విస్తరిస్తున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రజలు చెబుతున్న దాని ప్రకారం, “మేము చిన్నప్పటి నుంచే ఇక్కడే ఉంటున్నాం. ముప్పై సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం…

