మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతం!
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఉదయం అకస్మాత్తుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు–భద్రతా దళాల మధ్య చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో పలు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రారంభమైన ఈ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఫైర్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచార ప్రకారం, ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, వారిలో అత్యంత కీలక నాయకుడు హిడ్మా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక ధృవీకరణ…

