పెన్షనర్లను చంపకండి… బతకనీయండి”: 20 నెలలుగా 20 వేల కోట్లు బకాయి – పెన్షన్ జేఏసి ఆగ్రహం
తెలంగాణలో పెన్షనర్ల సమస్యలు తీవ్రమైన దశకు చేరుకున్నాయి. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా పెన్షన్ జేఏసి ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 నెలలుగా సుమారు ₹20,000 కోట్లు బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పెన్షనర్ల జేఏసి చైర్మన్ కే. లక్ష్మయ్య తీవ్రంగా విమర్శించారు. 🔹 “సీఎం గారు… మమ్మల్ని చంపకండి, బతకనీయండి” ఇందిరా పార్కులో జరిగిన పెన్షనర్ల మహాధరణలో మాట్లాడిన కే. లక్ష్మయ్య అన్నారు: “ఏడాదిన్నర దాటినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.మేము దాచుకున్న డబ్బులే…

