జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత — పరస్పరం ఫిర్యాదులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే కొన్ని కేంద్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ, తర్వాత వేళల్లో ఓటింగ్ వేగం తగ్గింది.ఇదే సమయంలో, ఎన్నికల వేడిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పరస్పర ఆరోపణలు తీవ్రతరంగా మారాయి. బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో బీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లు గొడవలకు పాల్పడుతున్నారని, స్థానికేతరులను ప్రచారానికి వినియోగిస్తున్నారని…

