నందమూరి మోక్షజ్ఞ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా థడాని.. ఫ్యాన్స్‌లో పూనకాలు!
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో, ఆయన వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తన మొదటి చిత్రంతో తెరపైకి రాబోతున్నాడు. ‘హనుమాన్’తో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ కోసం ఓ స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు “సింబ” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. యాక్షన్, ఎమోషన్, లవ్ స్టోరీ…

