జర్నలిస్టులకు మళ్లీ నిరాశే: రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేం అయ్యాయి?
తెలంగాణలో ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మీడియా వర్గాలకు ఎలాంటి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పొడిగించబడుతున్న అక్రిడిటేషన్ వ్యవస్థ, చిన్న, మధ్య తరహా పత్రికలను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టిందని మీడియా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇల్లు స్థలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్‌లో…

