ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు పెరుగుతున్నాయి – 3500 పోస్టుల సర్దుబాటుకు విద్యాశాఖ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలు తీవ్రంగా పెరిగినట్టు సమాచారం. ఇటీవల జరిగిన పదోన్నతుల ప్రక్రియలో దాదాపు 3500 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTs) ఉన్నత స్థానాలకు ప్రమోషన్ పొందడంతో, ప్రాథమిక స్థాయిలో టీచర్ల కొరత మరింతగా కనిపిస్తోంది. విద్యాశాఖ నివేదికల ప్రకారం, 13 జిల్లాల్లో ప్రాథమిక ఉపాధ్యాయుల కొరత అత్యధికంగా ఉందని అధికారులు గుర్తించారు. పలు పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు రెండు లేదా మూడు తరగతులకు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది….

