ప్రజాభవన్‌లో నిశ్చితార్థం వివాదం: భట్టి విక్రమార్క కుమారుడి వేడుకపై ప్రశ్నలు
నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఒక నిశ్చితార్థ వేడుక ఇప్పుడు రాజకీయ వేదికలపై పెద్ద చర్చగా మారింది. తెలంగాణ డెప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి కుమారుడు సూర్య విక్రమార్క నిశ్చితార్థం ప్రజాభవన్‌లో జరిపిన విషయం వివాదానికి కారణమైంది. సాధారణంగా ఇలాంటి వేడుకలు ప్రైవేట్ కన్వెన్షన్ హాల్స్, హోటల్స్ లేదా రిసార్ట్స్‌లో నిర్వహించడం మనం చూస్తుంటాం. అయితే, ముఖ్యమంత్రి నివాసం కోసం నిర్మించిన ప్రజాభవన్‌ను వ్యక్తిగత కార్యక్రమాలకు వినియోగించడం సరైందా? అన్న ప్రశ్న ఇప్పుడు తెలంగాణ…

