తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు – రోహిత్ వేముల బిల్‌కు రూపకల్పన, అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్ ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి Revanth Reddy అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా రోహిత్ వేముల పేరుతో ఒక ప్రత్యేక బిల్లుకు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్వేషపూరిత నేరాలను అరికట్టేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో న్యాయవాదుల భద్రత కోసం “తెలంగాణ అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్”కు కూడా క్యాబినెట్ ఆమోదం…

