ఆటో డ్రైవర్స్‌కు ₹24,000 బకాయిలు చెల్లించండి – రేవంత్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ ఆగ్రహం
తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి చెలరేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్స్‌కు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని బిఆర్ఎస్ ఆరోపించింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి ₹12,000 ఆర్థిక సాయం, ప్రమాద బీమా ₹10 లక్షల వరకు, ఆటో నగర్ నిర్మాణం, మరియు ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ…

