కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు: జీవన్ రెడ్డి రాజీనామా సంకేతాలు, పార్టీపై తీవ్ర విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింతగా బయటపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తూ, రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డానని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు పోరాటం చేశానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తనకు సరైన గుర్తింపు దక్కలేదని, తన సేవలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు….

