ఉత్తరప్రదేశ్లో విషాదం – రైల్వే ట్రాక్ దాటుతుండగా యువకుడిని రైలు ఢీకొట్టి మృతి!
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ఓ యువకుడిని రైలు ఢీకొట్టి చంపేసిన సంఘటన గ్రేటర్ నోయిడా పరిధిలోని దాద్రి ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తుషార్ అనే యువకుడు తన బైక్పై రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. అయితే రైల్వే గేట్ మూసివేసి ఉన్నప్పటికీ అతను నిర్లక్ష్యంగా దానిని దాటే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో దాన్ని…

