బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి ఆహ్వానం – కేసీఆర్ సూచనతో కరీంనగర్ నేతల సమావేశం, రాజకీయాల్లో కీలక పరిణామం
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం కీలక మలుపు తీసుకుంటోంది. కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీకి ఆయనను ఆహ్వానించేందుకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రముఖ నాయకులు కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకత్వం మొత్తం కలిసి జీవన్ రెడ్డి గారిని సాదరంగా బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఆయనకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న…

