అమీన్పూర్ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రిపోర్ట్ చేసిన జర్నలిస్టుపై దాడి – పట్టణచేరులో కలకలం
పటాన్చేరు / అమీన్పూర్:తెలంగాణలో మీడియా స్వేచ్ఛపై మరోసారి నీడ పడేలా ఘటన చోటుచేసుకుంది. అమీన్పూర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ధైర్యంగా రిపోర్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టు విత్తల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. తహసీల్దార్ నేతృత్వంలో జరిగిన అధికార పరిశీలనలో 30 గుంటల ప్రభుత్వ భూమిని (నర్సరీ, పార్క్ కోసం కేటాయించిన భూమి) ఆక్రమించినట్లు రిపోర్ట్ రావడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో సుమారు 15మంది ముసుగులు…

