బీసీ హక్కుల కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం… నేతలపై తీవ్ర ఆగ్రహం
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న యువతలో ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో సాయి ఈశ్వర్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సాయికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నప్పటికీ, బీసీల హక్కుల కోసం తాను ప్రాణం అర్పించడానికి సిద్ధమయ్యాడనడం అతని బాధ ఎంత లోతుగా ఉందో చూపిస్తోంది. ఆత్మహత్యా యత్న సమయంలో సాయి “జై బీసీ… కాంగ్రెస్ మోసం చేసింది… న్యాయం కావాలి” అంటూ…

