సాయి ఈశ్వర్ మృతి పై బీసీ సంఘాల ఆందోళన : తీన్మార్ మల్లన్న సహా పలువురి అరెస్ట్
మెడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని అగ్ని పెట్టుకున్న సాయి ఈశ్వరాచారి, గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ కుటుంబ పోషణ కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్టలో నివసిస్తూ క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరణ వార్త తెలిసిన వెంటనే…

