మానకొండూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వివాదం – ప్రజల్లో తీవ్ర ఆవేదన
మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికారంలోకి వచ్చేముందు రసమై బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు చేస్తూ “నీతి నిజాయితీతో ప్రజల సేవ చేస్తానని” హామీ ఇచ్చిన సత్యనారాయణ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత తాను మాట్లాడిన విధానమే వివాదానికి కారణమైంది. మీడియా ముందు సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు అన్‌పార్లమెంటరీగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రజా ప్రతినిధి ఇలాంటి భాషలో మాట్లాడడం సమంజసం కాదని…

