బీసీల గొంతుక కోసింది కాంగ్రెస్‌నే” — స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై తీవ్ర విమర్శలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తవుతున్నా, బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లు ఇంకా అమలు కాకపోవడంతో పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మీడియాతో మాట్లాడిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. ఆమె బీసీ రిజర్వేషన్లను తగ్గించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాల్లో…

