మహానటి భుజాలపై ‘రివాల్వర్ రీటా’ రిస్క్ – కీర్తి సురేష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా?
నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్‌కు సౌత్ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తర్వాత వచ్చిన లేడీ ఓరియెంటెడ్ లేదా కమర్షియల్ సినిమాలు ఆశించిన విజయం ఇవ్వలేదు. తెలుగులో దసరా హిట్ అయినా, భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశను మిగిల్చింది. అంతేకాదు, హిందీ సినిమాల్లో అడుగు పెట్టిన కీర్తి నటించిన బేబీ జాన్ కూడా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే, కీర్తి కెరీర్ కీలక దశలో ఉన్నట్టే…

