ఉద్యమకారుల హక్కులు ఎక్కడ? – ఆరు గ్యారంటీలపై ప్రజలు ప్రశ్నలు”
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. “ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం” అన్న హామీ ఇంతవరకూ అమలు కాలేదని ఆగ్రహ స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యమంలో రక్తం, చెమట చిందించిన ప్రజలు… ఇప్పుడు తమ హక్కుల కోసం మళ్ళీ రోడ్ల మీదికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?…

