అదిలాబాద్‌కు ఏడాదిలోపే ఎయిర్‌పోర్ట్: నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాదే – సీఎం రేవంత్”
అదిలాబాద్ జిల్లాలో జరిగిన భారీ జనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది లోపే అదిలాబాద్‌లో ఎయిర్‌బస్ ప్రమాణాలతో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పట్టాలెక్కించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. పట్టణం, గ్రామాల అభివృద్ధికి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బాధ్యతగా ఓటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. అభివృద్ధి చేయగలిగిన వారిని మాత్రమే గెలిపించాలని, అభ్యర్థులు అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేసే సంస్కృతిని అడ్డుకోవాలని కోరారు….

