ఫార్ములా–ఈ కుంభకోణం: కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ – ఏసీబీ అరెస్ట్ దిశగా చర్యలు సత్వరం?
ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయని గత రెండేళ్లుగా సాగుతున్న చర్చ మరోసారి హాట్ టాపిక్ అయింది. మునుపటి ప్రభుత్వం కాలంలో ప్రజా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి కేటీఆర్‌పై దర్యాప్తు కొనసాగుతుండగా, ఇప్పుడు ఈ కేసులో కీలకమైన మలుపు తిరిగింది. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఫార్ములా–ఈ రేస్‌కు సంబంధించిన అన్ని పత్రాలను, నిర్ణయాలను, ఫండ్స్ వినియోగాన్ని, సంబంధిత అధికారుల స్టేట్‌మెంట్‌లను పరిశీలించి ముఖ్యమైన ఆధారాలను సేకరించారని ప్రభుత్వం వెల్లడించింది. అధికారులలో…

