లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా? హైదరాబాద్ చుట్టుపక్కల భూ మాఫియా ఆగడాలు వెలుగులోకి
హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, సంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లో భారీ స్థాయిలో ప్రభుత్వ భూముల కబ్జాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అధికారిక అంచనాల ప్రకారం ఈ మూడు జిల్లాల్లోనే దాదాపు లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి భూ మాఫియా అనుసరిస్తున్న పద్ధతులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సీలింగ్, భూదాన్, పోరంబోకు, బంజరు భూములను లక్ష్యంగా చేసుకుని డాక్యుమెంట్ల టాంపరింగ్,…

