బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సెలబ్రిటీల విచారణ—”తెలియక చేశాం” వివరణపై సిట్ ప్రశ్నలు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ప్రముఖ సినీ నటులు, యాంకర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లను సిఐడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విచారిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నటి నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, సోషల్ మీడియాలో ప్రసిద్ధి పొందిన అమృత చౌదరి శుక్రవారం లకడీకాపుల్‌లోని సిఐడి కార్యాలయానికి హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరైన వారిని సిట్ బృందం—ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, సిఐడి ఎస్పీ వెంకటలక్ష్మి తదితర అధికారులు—వివిధ కోణాలలో ప్రశ్నించారు. ప్రచారం…

