క్యాబినెట్‌లో రగడ: పవర్ ప్లాంట్ ప్రతిపాదనపై మంత్రుల ఫైర్
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈసారి తీవ్ర రగడకు వేదికైంది. ప్రభుత్వ శాఖలు, ముఖ్యంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ సమర్పించిన పవర్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్‌పై పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు లేని ప్రదేశంలో పవర్ ప్లాంట్‌ను ప్రతిపాదించడం సరికాదని మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్యూరోక్రాట్లు ఇచ్చిన పిపిటిపై మంత్రులు సూటిగా ప్రశ్నించారు—“యాదాద్రిలో బిఆర్ఎస్ కట్టిన ప్లాంట్‌ని మనమే విచారణ వేసి తప్పు అన్నాం. ఇప్పుడు మళ్లీ అలాంటిదే ఎందుకు ప్రతిపాదిస్తున్నాం?” తద్వారా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు…

