తెలంగాణలో లక్ష బోగస్ ఉద్యోగాలు గుర్తింపు – బీఆర్ఎస్ హయాంలో 18 వేల కోట్ల ప్రజాధనం వృథా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో దాదాపు లక్షకు పైగా బోగస్ ఉద్యోగాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగాల పేరుతో సుమారు 18,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ఆర్థిక శాఖ ప్రారంభ అంచనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,93,820 మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, తాత్కాలిక, పార్ట్ టైమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో కేవలం 2,74,844 మంది మాత్రమే తమ పూర్తి వివరాలు సమర్పించారు, ఇంకా 2.18…

