జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం — మేయర్ అవినీతి ఆరోపణలతో రాజకీయ ఉద్రిక్తతలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసీ) భవిష్యత్తు రూపు ఎలా ఉండబోతుందో అనేది మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తాజాగా జిహెచ్ఎంసీ విస్తరణలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 అర్బన్ లోకల్ బాడీలను విలీనం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనితో కొత్తగా ఒకే మెగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, లేదా రెండు మూడు కార్పొరేషన్లుగా విభజించాలా అనే అంశంపై ప్రభుత్వం మున్సిపల్ శాఖకు స్టడీ ఆదేశించింది. ఇందులో భాగంగా ఢిల్లీ మరియు…

