కంటోన్మెంట్ లో ప్రజల గోడు: డ్రైనేజ్, మౌలిక సదుపాయాల లోపం పై ఆగ్రహం
కంటోన్మెంట్ ఉప ఎన్నికల వేళ ప్రజల సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. “ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు కనిపిస్తారు, తరువాత మాత్రం ఎవరూ పట్టించుకోరు” అంటూ స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గల్లీల్లో నీటి పెంగులు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ప్రబలంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని, పలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలో నీరు చేరి పిల్లలు, పెద్దలు రోగాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు….

