కొండా సురేఖ కేసు: పోలీసుల ప్రవర్తనపై ఆవేదన వ్యక్తం చేసిన సుమంత్
కొండా సురేఖ కుటుంబంపై జరుగుతున్న పరిణామాలకు సంబంధించి సుమంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు రాత్రివేళ ఇల్లు చుట్టుముట్టారని, తన కుటుంబంపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. “ఇంతమంది పోలీసుల మధ్య నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఎలాంటి తప్పూ చేయకపోయినా ఇలా ప్రవర్తించడం బాధాకరం” అని సుమంత్ వ్యాఖ్యానించారు.అతను ఇంకా “మా కుటుంబం ఎప్పుడూ కార్యకర్తలతో ఉంటుంది, మేము పోరాడతాం, ఎవరైనా నన్ను తీసుకెళితే ప్రజలు ఖండించాలి” అని పేర్కొన్నారు.

