సినిమా థియేటర్లలో అక్రమ పార్కింగ్ వసూళ్లు – ప్రజల్లో ఆగ్రహం
సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజుల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిబంధన ప్రకారం సినిమాహాళ్లలో పార్కింగ్ ఉచితమే అయినప్పటికీ, అనేక థియేటర్లు పబ్లిక్ నుండి డబ్బులు వసూలు చేస్తూ దోపిడికి పాల్పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు యువజన సంఘాలు, కార్యకర్తలు ఒకే వేదికపైకి వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు మాట్లాడే ధైర్యం చేయకపోతే ఈ దోపిడీ వ్యవస్థ ఎప్పటికీ ఆగదని, అందరూ ముందుకు రావాలని వారు…

