తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల — బీసీ రిజర్వేషన్ తీర్పుపై ఉత్కంఠ

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. ఎన్నికల కమిషన్ ఈ రోజు నుండి షెడ్యూల్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 31 జిల్లాల్లో 58 రెవెన్యూ డివిజన్లు, 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లకు ఈ నెల 11వ తేదీ వరకు సమయం ఇవ్వబడింది. పోలింగ్ అక్టోబర్ 23న, కౌంటింగ్…

Read More