‘Toxic’.. అసలు క్లారిటీ ఇచ్చిన మేకర్స్

                    ‘KGF’ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత, రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ సినిమా ఏంటి, ఎలా ఉండబోతోంది అనేది ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక కాస్త టైమ్ తీసుకున్న యష్ గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. అయితే, ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి, దీని చుట్టూ పాజిటివ్ బజ్ కన్నా.. “వాయిదా” రూమర్లే ఎక్కువగా చక్కర్లు కొట్టాయి.

                                                   సినిమా షూటింగ్ డిలే అవుతోందని, యష్ ఒకేసారి ‘రామాయణ’ షూటింగ్‌లో కూడా ఉండటంతో ‘టాక్సిక్’ అనుకున్న టైమ్‌కు రాదని గట్టిగా ప్రచారం జరిగింది. ఇది ఫ్యాన్స్‌ను చాలా కన్ఫ్యూజ్ చేసింది. ఈ రూమర్లన్నిటికీ చెక్ పెడుతూ, మేకర్స్ ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పూ లేదని తేల్చి చెప్పారు. నిర్మాతలు ముందు అనౌన్స్ చేసినట్లే, ‘టాక్సిక్’ సినిమా 2026, మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ డేట్ లాక్ చేయడం వెనుక ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంది. ఇది కేవలం ఒక డేట్ కాదు, పాన్ ఇండియా కలెక్షన్లకు ఒక జాక్‌పాట్ అని చెప్పవచ్చు. ఆ వారం ఇండియన్ బాక్సాఫీస్‌కు గోల్డెన్ వీక్. ఆ టైమ్‌లోనే ఉగాది, గుడి పడ్వా (మరాఠీ) లాంటి ప్రాంతీయ న్యూ ఇయర్ సెలవులు వస్తున్నాయి.

                                                     దానికి తోడు, ఈద్ ఫెస్టివల్ హాలిడేస్ కూడా అప్పుడే కలిసి వస్తున్నాయి. అంటే, నార్త్, సౌత్.. ఇండియా మొత్తం పండగ సెలవుల్లో ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో రిలీజైతే, సినిమాకు టాక్ కొంచెం అటుఇటుగా ఉన్నా, ఓపెనింగ్స్ మాత్రం ఊహకందని రేంజ్‌లో ఉంటాయి. ఈ క్లారిటీతో మేకర్స్ ఫ్యాన్స్‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. సినిమా వీఎఫ్‌ఎక్స్ పనులు కూడా ఏప్రిల్ నుంచే మొదలయ్యాయని, జనవరి 2026 నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్నామని పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలిపారు. ఇక రిలీజ్‌కు 140 రోజులే టైమ్ ఉందని కౌంట్‌డౌన్ కూడా స్టార్ట్ చేశారు. ‘టాక్సిక్’ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. దీన్ని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ సొంత బ్యానర్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ ఫెస్టివల్ రిలీజ్‌తో ‘KGF’ రికార్డులను బ్రేక్ చేయడమే యష్ టార్గెట్‌గా కనిపిస్తోంది. మరి సినిమా ఏ స్థాయిలో హైలెట్ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *