బీహార్ ఎగ్జిట్ పోల్స్ 2025: NDA కూటమిదే అధికారం అంటున్న సర్వేలు!

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. రెండు దశల్లో పోలింగ్ పూర్తి కాగా — నవంబర్ 6న 121 స్థానాలకు, నవంబర్ 11న 122 స్థానాలకు ఓటింగ్ జరిగింది. బీహార్‌లో అధికారం చేజిక్కించుకోవాలంటే 243 సీట్లలో కనీసం 122 సీట్లు అవసరం. ఈ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం ఎన్డీయే కూటమికే అధికారం దక్కుతుందని సూచిస్తున్నాయి.

📊 దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్:

  • NDA కూటమి: 145–160 సీట్లు
  • మహా కూటమి: 73–91 సీట్లు
  • ఇతరులు: 5–10 సీట్లు
    ఈ సర్వే ప్రకారం NDA స్పష్టమైన మెజారిటీ సాధించవచ్చని అంచనా.

🗳️ న్యూస్24-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్:

  • NDA: 147–167 సీట్లు
  • మహాఘట్ బంధన్: 70–90 సీట్లు
  • ఇతరులు: 5–10 సీట్లు
    ఈ సర్వే ప్రకారం NDA స్పష్టమైన మెజారిటీ సాధించవచ్చని అంచనా.
  • 🗳️ న్యూస్24-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్:
  • NDA: 147–167 సీట్లు
  • మహాఘట్ బంధన్: 70–90 సీట్లు
  • జన్ సూరాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్): 0–2 సీట్లు
  • AIMIM: 2–3 సీట్లు
  • ఇతరులు: 2–5 సీట్లు
  • 📈 పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్:
  • NDA (బీజేపీ + జేడీయూ): 133–159 సీట్లు
  • మహాఘట్ బంధన్ (కాంగ్రెస్ + ఆర్జేడీ): 75–101 సీట్లు
  • జన్ సురాజ్ పార్టీ: 5 సీట్లు
  • ఇతరులు: 2–8 సీట్లు
  • పీపుల్స్ ఇన్ సైట్ ఎగ్జిట్ పోల్:
  • NDA: 133–148 సీట్లు
  • మహాఘట్ బంధన్: 87–102 సీట్లు
  • JSP: 0–2 సీట్లు
  • ఇతరులు: 3–6 సీట్లు
  • 📊 చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్:
  • NDA: 130–138 సీట్లు
  • మహాఘట్ బంధన్: 100–108 సీట్లు
  • జన్ సురాజ్: 0
  • ఇతరులు: 3–5 సీట్లు
  • ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీహార్‌లో మళ్లీ NDA కూటమి ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. అయితే, ఇవి కేవలం అంచనాలు మాత్రమే. తుది ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. గతంలో ఎగ్జిట్ పోల్స్ తప్పు నిరూపితమైన సందర్భాలు ఉన్నందున, అధికారానికి నిజంగా ఎవరు చేరుకుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *