భూభారతి పోర్టల్లో మరో బ్రేక్.. 40 శాతం రిజిస్ట్రేషన్లు పెండింగ్!
తెలంగాణ భూభారతి పోర్టల్లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి భూభారతి వెబ్సైట్లో సిటిజన్ లాగిన్ సరిగా పనిచేయడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. మొబైల్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా వివరాలు సరిగ్గా నమోదు చేసినా లాగిన్ కాకపోవడం, రెండు నిమిషాల్లో ఓటీపీ వస్తుందని మెసేజ్ కనిపించినా ఓటీపీ రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. దీంతో స్లాట్ బుక్ చేసుకోవడం, అప్లికేషన్లు సమర్పించడం, ఇప్పటికే బుక్ చేసుకున్న స్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్…

