ఏపీకి పరిశ్రమల తరలింపు కుట్రా? – హిల్ట్ పాలసీపై తెలంగాణలో ఆందోళన

తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తుపై పెద్ద చర్చ మొదలైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీతో సుమారు 5,000 పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక కొన్ని కీలక నేతల కుట్ర ఉందని పరిశ్రమల వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

తెలంగాణలోని పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న, మధ్య తరహా తయారీ యూనిట్లు కాలుష్య నియంత్రణ పేరుతో తరలించే నిర్ణయం పరిశ్రమల భవితవ్యాన్ని అనిశ్చితిలోకి నెడుతోంది.

విమర్శకుల వాదన:

హిల్ట్ పేరిట Telangana industrial landను రియల్ ఎస్టేట్‌గా మార్చే అజెండా నడుస్తోంది. పరిశ్రమలు మూతపడితే వేల కుటుంబాలు రోడ్డున పడతాయి.”

ఇంతలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని అవకాశంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఏపీలో చవకగా భూములు, పన్ను రాయితీలు, అనుమతుల సులభతరం చేయడం వంటి అంశాలతో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు మొదలయ్యాయి.

కొత్త పరిశ్రమలు తెలంగాణలో బదులు ఏపీకి వెళ్ళే ప్రమాదం ఉందని పరిశ్రమల రంగానికి చెందిన పలువురు హెచ్చరిస్తున్నారు.

కొంతమంది పరిశ్రమదారులు ప్రశ్నిస్తున్నారు:

“ఇక్కడ పరిశ్రమలు మూతపడుతున్నాయి… కానీ APలో మాత్రం ఫ్యాక్టరీలకు రెడ్ కార్పెట్ ఎందుకు? ఇది ప్లాన్‌డ్ ఇండస్ట్రీ షిఫ్ట్ా?”

కానీ పరిశ్రమల అసలు భయం మాత్రం ఇదే—

📌 Telanganaలో ఫ్యాక్టరీలు మూతపడతాయా?
📌 ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుందా?
📌 AP పరిశ్రమల కొత్త హబ్‌గా మారుతుందా?

ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే నెలల్లో స్పష్టమవుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *