తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయం వేడెక్కిస్తోంది. 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు కాలేదన్న ఆవేదనతో బీసీ కులానికి చెందిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు సంవత్సరాల నుంచి 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఉద్యమ నాయకులు తీవ్రంగా మండిపడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానాలను ప్రశ్నించారు.
“ఒక బీసీ బిడ్డ చనిపోయినా ప్రభుత్వం నుంచి ఒక్క మంత్రి, ఒక్క అధికారి కూడా వచ్చి పరామర్శించలేదు. మాటలు చెప్పేటప్పుడు బీసీలు గుర్తుంటారు కానీ పని చేసే సమయంలో మమ్మల్ని మరచిపోతారా?” అని నేతలు ప్రశ్నించారు.
మృతుడికి చిన్న పిల్లలు ఉన్నారని, కనీసం బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం, భార్యకు ఉద్యోగం, పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మృతుడికి చిన్న పిల్లలు ఉన్నారని, కనీసం బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం, భార్యకు ఉద్యోగం, పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
“మమ్మల్ని ఓట్లు కోసం వాడుకుని, హామీ ఇవ్వడం మాత్రమే పని కాదు. దాన్ని అమలు చేయాలి. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు బీసీలు వెనక్కి తగ్గరు” అని బీసీ సంఘాలు హెచ్చరించాయి.
ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఉద్యమం మరింత ముదురుతుందని నేతలు ప్రకటించారు.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ రాజకీయాలు మరింత ఉత్కంఠత సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

