శ్రేయస్ vs ప్రయాస్ – బాధ్యతాయుత బడ్జెట్ దృష్టికోణం
మన వేదాల్లో చెప్పినట్టుగా ప్రయాస్ కాదు, శ్రేయస్ ముఖ్యము.
ప్రయాస్ అంటే – ఇప్పుడే కనిపించే సంతోషం, తాత్కాలిక లాభం.
శ్రేయస్ అంటే – బాధ్యతతో నిర్ణయాలు తీసుకుని, ఇప్పుడు కూడా లాభం ఉండేలా, భవిష్యత్తులో దేశం బలపడేలా చేసే విధానం.
ఈ బడ్జెట్ అదే శ్రేయస్ దృష్టితో వచ్చింది.
ఇది ఫ్రీబీలు పంచే బడ్జెట్ కాదు.
ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, ఆర్థిక క్రమశిక్షణతో ప్రజలకు నిజమైన లాభం చేసే బడ్జెట్.
బడ్జెట్‌కి ముందే:
- GST తగ్గింపులు
- ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్
- Ease of Doing Business కోసం దాదాపు 2000కి పైగా చట్ట సవరణలు
- జన్ విశ్వాస్ బిల్ ద్వారా చిన్న వ్యాపారుల నుంచి పెద్ద ఇండస్ట్రీల వరకూ అనవసర ఇబ్బందులు తొలగింపు
- లేబర్ కోడ్స్ అమలు – పెట్టుబడులకు అనుకూల వాతావరణం
- ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెంపు
ఇవి సంఖ్యల కోసం కాదు, లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం తీసుకున్న నిర్ణయాలు
రైతులు, గ్రామీణ ప్రాంతాలపై విమర్శలకు సమాధానం
విపక్షాలు “రైతులకు ఏం చేయలేదు” అంటున్నాయి.
అది అసత్యం.
- అగ్రికల్చర్ బడ్జెట్ మాత్రమే చూసి తీర్పు చెప్పకూడదు
- ఫర్టిలైజర్ సబ్సిడీ – కెమికల్స్ శాఖ కింద ఉంటుంది
- ఫుడ్ సబ్సిడీ – వేరే హెడ్లో ఉంటుంది
- ఉపాధి హామీ కూడా అగ్రికల్చర్ కింద కాదు
పేదల సంక్షేమంపై ఖర్చు:
- ₹86,000 కోట్ల నుంచి ₹1.50 లక్షల కోట్లకు పెంపు
పేదల చేతిలో ₹20,000 పెడితే అది సేవింగ్స్ కాదు –
మొత్తం గ్రామీణ మార్కెట్లోనే తిరుగుతుంది
దానిపై GST వస్తుంది → గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
ఇది శ్రేయస్ ఆలోచన.
అగ్రికల్చర్లో కొత్త దిశ
ఇప్పుడు సమస్య ఉత్పత్తి కాదు, విలువ (Value).
తెలంగాణలో:
- వినియోగం: ~40 లక్షల టన్నులు
- ఉత్పత్తి: ~2.8 కోట్ల టన్నులు
ఇంకా వరి పెంచడం పరిష్కారం కాదు.
అందుకే ఫోకస్:
- హై వాల్యూ క్రాప్స్
- ఎడిబుల్ ఆయిల్స్
- పప్పులు
- కొబ్బరికాయలు
- ఎగుమతులకు అనుకూల పంటలు
ఇది సంఖ్యల బడ్జెట్ కాదు, ఫోకస్డ్ బడ్జెట్.
హెల్త్‌కేర్ & రైల్వే విజన్
- హెల్త్‌కేర్ హబ్స్
- హెల్త్ టూరిజం
- రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పనిచేయడానికి సిద్ధం
హైదరాబాద్:
- ఇప్పటికే పెద్ద హాస్పిటల్స్
- హెల్త్ హబ్‌గా మారే పూర్తి అవకాశాలు
రైల్వేస్:
- హైదరాబాద్ దేశానికి సెంట్రల్ నోడ్
- పుణె, చెన్నై, ఇతర దిశలకి హైస్పీడ్ రైల్వే ప్రణాళిక
- ఈ బడ్జెట్లో రైల్వే అలొకేషన్ ~8% పెంపు
(ఇది ఒకే ఏడాదిలో ఫలితం ఇవ్వదు – 2–3 ఏళ్ల విజన్)
తెలంగాణ ప్రస్తావన లేదు” అనే విమర్శపై
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల పేర్లు చెప్పడం సంప్రదాయం కాదు.
నెహ్రూ కాలంలో అసలు రాష్ట్రాల ప్రస్తావనే ఉండేది కాదు.
ఇందిరా గాంధీ తర్వాతే రాష్ట్రాల పేర్లు చెప్పే అలవాటు మొదలైంది.
దేశం మొత్తం రాష్ట్రాల సమాఖ్య.
కేంద్ర బడ్జెట్ రాష్ట్రాల మధ్య తేడా చూపించేందుకు కాదు.
రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్ర బడ్జెట్లో
“కరీంనగర్‌కు ఇంత, రంగారెడ్డికి ఇంత” అని విడివిడిగా పెట్టరు కదా?
ముగింపు
ఈ బడ్జెట్:
- ఫ్రీబీల బడ్జెట్ కాదు
- బాధ్యతలతో వచ్చిన బడ్జెట్
- Viksit Bharat 2047 లక్ష్యానికి అవసరమైన బడ్జెట్
- తాత్కాలిక ప్రయాస్ కాదు – దీర్ఘకాలిక శ్రేయస్

