రేవంత్ రెడ్డి పాలనపై ప్రజా వ్యతిరేకత: బీసీ రిజర్వేషన్, పంచాయతీ ఎన్నికలు, ఫ్యూచర్ విజన్ పై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హాట్ టాపిక్‌గా మారింది. బీసీ రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికలు, గవర్నర్ ఆమోద ముద్ర సమస్యలతోపాటు ప్రజా సంక్షేమంపై లోపాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జూబ్లీహిల్స్ టికెట్‌ ఇస్తూ నాయ‌కత్వం లోపాలు బయటపడ్డాయని విమర్శకులు చెబుతున్నారు. “నవీన్ యాదవ్ గెలిస్తే అది కాంగ్రెస్ పాలన వల్ల కాదు, మైనారిటీ సపోర్ట్ వల్లే” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి.

అంతేకాకుండా, బీసీ రిజర్వేషన్ బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర ఇవ్వకపోవడం పట్ల ప్రభుత్వం ఎటువంటి దిశలోనూ ముందుకు వెళ్లలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో ఇలాంటి పరిస్థితిలో సీఎం స్టాలిన్ సుప్రీం కోర్టుకు వెళ్ళారని, కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం నిశ్శబ్దంగా ఉందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

బీసీ రిజర్వేషన్ పేరుతో డ్రామా చేసి పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసుకోవడమే లక్ష్యం” అని విమర్శకులు చెబుతున్నారు. ఒకవేళ ఇది తప్పు అయితే, ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లి గవర్నర్‌పై చర్య తీసుకోవాలని వారు సవాల్ విసిరారు.

ఇదే సమయంలో, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, ఎలక్ట్రిక్ స్కూటీలు, యువ వికాస పథకాలు వంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు అమలు కాని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి కలిగిస్తోంది.

ప్రజల మాటల్లో, “ప్రెజెంట్ విజన్ లేదు, ఫ్యూచర్ విజన్ సర్వేలు మాత్రం చేస్తున్నారు” అనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైడ్రా బుల్డోజర్ భయం, వీకెండ్‌ రోజుల్లో ప్రజల ఆందోళన కూడా రేవంత్ ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో అప్డేటెడ్‌గా ఉన్న ఈ కాలంలో, ఈ రాజకీయ డ్రామాలు పబ్లిక్‌ను మోసం చేయలేవని ప్రజల అభిప్రాయం. ఒకవైపు ప్రజలు సంక్షేమ పథకాలు కోరుకుంటుంటే, మరోవైపు ప్రభుత్వం ఇమేజ్ రక్షణలో బిజీగా ఉందని వ్యాఖ్యానాలు వెల్లువెత్తుతున్నాయి.

మొత్తం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత, పాలనలో లోపాలు, రిజర్వేషన్ వివాదాలు అనే త్రికోణ ఒత్తిడిలో ఉంది. పంచాయతీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, ఈ వివాదాలు కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *