జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ పట్ల ప్రజా ఉత్సాహం — బంపర్ మెజారిటీ ఊహ

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పట్ల ప్రజల్లో అపారమైన మద్దతు కనిపిస్తోంది. ఆయన ర్యాలీల్లో లక్షల మంది పాల్గొంటున్నారని, ఈ ఉత్సాహం ఓట్లుగా మారబోతోందని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల అభిప్రాయం ప్రకారం — “ఈసారి పార్టీ పరంగా కాదు, నవీన్ యాదవ్ వ్యక్తిత్వం చూసి ఓటేస్తాం” అని చెప్తున్నారు. కొంతమంది మాట్లాడుతూ, “టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పని అయిపోయింది. కేసీఆర్ మళ్లీ సభ పెట్టినా పరిస్థితి మారదు. నవీన్ యాదవ్ బంపర్ మెజారిటీతో గెలుస్తాడు” అని ధైర్యంగా అంటున్నారు.

ప్రజలు మరింతగా మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేషన్ కార్డులు, పథకాలు, సబ్సిడీలు ఇవ్వడం మొదలుపెట్టింది. రెండు సంవత్సరాలు కూడా పూర్తికాలేదు — అయినా ప్రతి పనిలో అభివృద్ధి కనిపిస్తోంది. పథకాలు పూర్తి కావాలంటే టైం పడుతుంది. నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి అవుతాడు, జూబ్లీహిల్స్ అభివృద్ధి ఖాయం” అని తెలిపారు.

ప్రతిపక్షం చేస్తున్న ఫేక్ ఓటర్ ఐడీ ఆరోపణలను ప్రజలు తిప్పికొడుతూ, “వాళ్లే రౌడీజం చేస్తారు. నవీన్ యాదవ్ ప్రజా నాయకుడు, పబ్లిక్ మధ్య తిరిగే వ్యక్తి. ఫామ్ హౌస్‌లో కూర్చోని నాయకుల కాలం పోయింది, ఇప్పుడు పబ్లిక్‌లో ఉన్న నాయకుల కాలం వచ్చింది” అని అన్నారు.

జూబ్లీహిల్స్ ప్రజల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పట్ల స్పష్టమైన ఉత్సాహం కనపడుతోంది. స్థానికుల మాటలో — “ఈసారి జూబ్లీహిల్స్ నిర్ణయం నవీన్ యాదవ్ పక్షానే ఉంటుంది” అని నమ్మకంగా చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *