జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉపఎన్నికలు వేడెక్కుతున్నాయి. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో “నవీన్ అన్నే మా లీడర్” అంటూ ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు స్పష్టంగా చెబుతున్నారు — “మా లీడర్ బెస్ట్ లీడర్, ఎడ్యుకేటెడ్ లీడర్ అంటే నవీన్ అన్నే. ఆయన అందరికీ దగ్గరగా ఉంటాడు, పనులు చేసి చూపిస్తాడు.”
బిఆర్ఎస్ వైపు నుంచి “ఫేక్ ఓటర్ ఐడీస్” ప్రచారం జరుగుతున్నా, కాంగ్రెస్ వర్గాలు దాన్ని ఖండిస్తున్నాయి. ఒక కార్యకర్త మాట్లాడుతూ — “మనం రియాక్షన్ కాదు, రిజల్ట్ తో మాట్లాడతాం. ఫేక్ ఓట్లు వేసేది ఎవరో ప్రజలకు తెలుసు. ప్రతి బూత్‌లో అసలైన ఓటర్లు ఉన్నారు” అని స్పష్టం చేశారు.
ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ఏ సభ పెట్టినా ఫలితం మారదు. జూబ్లీ హిల్స్ ప్రజలు నవీన్ యాదవ్‌కే ఓటు వేస్తారు. పబ్లిక్‌లో తిరిగే లీడర్‌నే ప్రజలు ఎంచుకుంటారు” అన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల మాటల్లో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది — “2014లోనే మేము సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం, ఈసారి మాత్రం బంపర్ మెజారిటీతో గెలుస్తాం” అని అన్నారు.
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో యువత ఉత్సాహం, కాంగ్రెస్ శిబిరంలో నమ్మకం పెరుగుతోంది. ఫేక్ ఓటర్ ఆరోపణలను తిప్పికొడుతూ, నవీన్ యాదవ్ విజయం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

