News
ముఖ్యమంత్రి లేని పాలన? తెలంగాణ క్యాబినెట్‌లో గందరగోళం, హై డ్రామా రాజకీయాలు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే పాలన కంటే హై డ్రామా ఎక్కువగా నడుస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి, చదువుల పేరుతో ట్రైనింగ్‌లకు వెళ్లిన సీఎం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు – కానీ అరెస్టులు లేవు, చర్యలు లేవు. మొత్తం వ్యవహారం “నువ్వు కొట్టినట్టు చేయి… నేను ఏడిచినట్టు చేస్తా” అన్న నాటకంలా మారిపోయింది. బీఆర్‌ఎస్ నేతలపై జరుగుతున్నట్టుగా చూపిస్తున్న చర్యలు చూస్తే, ఏదో పాకిస్తాన్‌పై…
ఎవరికి కట్టారు? ఎమ్మెల్యేల అయోమయం, పార్టీ మార్పులపై రాజకీయ వ్యంగ్యం
తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రజలకు ఒకటే సందేహం – ఎవరు ఏ పార్టీలో ఉన్నారు?పార్టీ మార్పులు, మాటల మార్పులు, స్టాండ్‌ల మార్పులతో ఎమ్మెల్యేల పరిస్థితి పూర్తిగా అయోమయంగా మారింది. తాజాగా దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఓపెన్‌గా ప్రకటించారు. అంతే కాదు, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం “నేను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా, నన్ను సస్పెండ్ చేయలేదు,…
రైతు సమస్యల్లో కాంగ్రెస్ పాలన విఫలం: బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు
సిద్దిపేట్ మార్కెట్ యార్డ్‌లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు రైతు సమస్యలపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ₹8,000 మద్దతు ధర (MSP) ప్రకారం రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయించుకోవాలని, మధ్యదళారుల చేత మోసపోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులకు పిలుపునిచ్చారు. దేశంలో పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి సరిపడా లేకపోవడంతో ప్రతి సంవత్సరం భారీగా దిగుమతులు చేయాల్సి వస్తోందని…
కేసీఆర్‌కు నోటీసులపై తీవ్ర విమర్శలు: తెలంగాణ గడ్డను అవమానిస్తున్న పాలకులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, రాష్ట్ర అవతరణకు తన జీవితాన్ని అంకితం చేసిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నోటీసులు కేవలం ఒక నాయకుడికి మాత్రమే కాదు, తెలంగాణ గడ్డకే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికే అవమానమన్న భావన బలంగా వ్యక్తమవుతోంది. కేసీఆర్‌పై చర్యల పేరుతో జరుగుతున్న వ్యవహారాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి. తమ…
తెలంగాణ కాంగ్రెస్‌లో కలహాలు: రేవంత్ రెడ్డి నాయకత్వంపై పెరుగుతున్న విమర్శలు
రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రశ్నలు, స్కామ్‌లపై ఆరోపణలు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, అసమ్మతి స్వరాలు బహిరంగంగా వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియా వేదికలపై వస్తున్న కథనాలు, నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్‌లో చీలికలు తప్పవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అనేది కొత్త కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా అంతర్గత భేదాభిప్రాయాలు ఉండేవని నేతలు గుర్తు…
వెండి కిలో ₹4 లక్షలు… బంగారం ₹67 వేలు: మధ్యతరగతికి అందని ధరలు
గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా వెండి ధర కిలోకు రూ.4 లక్షలకు చేరిందంటే పరిస్థితి ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 28 రోజుల్లోనే వెండి ధర దాదాపు రూ.1.44 లక్షలు పెరగడం మార్కెట్‌ను షాక్‌కు గురి చేసింది. మరోవైపు బంగారం కూడా ఒక్కరోజులోనే రూ.13,000కుపైగా పెరిగి తులానికి రూ.67,000 మార్క్‌ను దాటింది. ఈ ధరల పెరుగుదలతో బంగారం కాయిన్లు, బిస్కెట్లు మార్కెట్లో అందుబాటులో లేకుండా పోతున్నాయి. డిమాండ్…
22 వేల పెట్టుబడితో 22 లక్షల ఆదాయమా? ఫేక్ ఏఐ వీడియోలతో కొత్త సైబర్ మోసాలు
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈజీ మనీ పేరుతో అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల ఫేక్ వీడియోలు, వాయిస్‌లను సృష్టిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్లుగా ఫేక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ…
సొంత ఇంటికి తిరిగొచ్చా”: రాజకీయ మోసాలు, అంతర్గత కుట్రల మధ్య నేత ఆవేదన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో భారీ చప్పట్ల మధ్య తన రాజకీయ ప్రయాణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేత, తన బయటికివెళ్లడానికి గల కారణాలను బహిరంగంగా వెల్లడించారు. రాజకీయంగా ఎదగకుండా చేయడానికి కొందరు నాయకులు తనపై, ఇతరులపై బురదజల్లారని, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కుట్రపూరిత రాజకీయాలు నడిచాయని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో అనేకమంది నాయకుల ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తిగా కడియం శ్రీహరి పేరును ప్రస్తావిస్తూ, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో రహస్య…
దానం నాగేంద్ర యూ–టర్న్: రాజీనామా భయం, అఫిడివిట్ డ్రామా, అనర్హత వేటకు తప్పించుకునే ప్రయత్నమా?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక నెల క్రితం తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని బహిరంగంగా ప్రకటించిన దానం, తాజాగా మాత్రం “నేను ఇంకా బిఆర్ఎస్‌లోనే ఉన్నాను” అంటూ స్పీకర్‌కు అఫిడివిట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది సాధారణ యూ–టర్న్ కాదు… ఇది రాజీనామా భయంతో తీసుకున్న రాజకీయ వెనకడుగుగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దానంకు అనుకూలంగా లేవన్న ప్రచారం బలంగా…
ఆటో డ్రైవర్ల సమస్యలపై రాజకీయ నాటకాలు: కవిత స్టేట్‌మెంట్లలో స్పష్టత ఎక్కడ?
ఇటీవలి కాలంలో కల్వకుంట్ల కవిత ఇచ్చే స్టేట్‌మెంట్లు పూర్తిగా గందరగోళంగా మారాయి.ఒకవైపు “బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు” అంటారు, మరోవైపు ఆటో డ్రైవర్లకు “రూ.12,000 ఇవ్వండి” అంటూ సడన్‌గా డిమాండ్ పెడతారు. పైగా ఇతర జిల్లాల ఆటోలను హైదరాబాద్‌లోకి రానివ్వొద్దంటూ వ్యాఖ్యలు చేస్తారు. ఈ స్టేట్‌మెంట్లన్నీ చూస్తే రాజకీయంగా ఎదగాలనే తొందర తప్ప, సమస్యలపై స్పష్టత కనిపించడం లేదు. గత పదేళ్లుగా ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడని వారు, ఇప్పుడు ఒక్కసారిగా రూ.12,000 అంశాన్ని ముందుకు తేవడం…

