93 ఎకరాల చెరువుపై 350 ఎకరాల కబ్జా?అమీన్‌పూర్ పెద్ద చెరువు చుట్టూ వెట్లాండ్–ఎఫ్టీఎల్ వివాదం

తెలంగాణలోని అమీన్‌పూర్ పెద్ద చెరువు చుట్టూ తీవ్ర వివాదం కొనసాగుతోంది. అధికారికంగా చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు మాత్రమేనని రికార్డులు చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం చెరువుకు సంబంధం లేని 350 ఎకరాలకు పైగా భూమిని వెట్లాండ్–ఎఫ్టీఎల్ పేరుతో కబ్జా చేసినట్లు భూ యజమానులు ఆరోపిస్తున్నారు. చెరువుకు అడ్డంగా సుమారు 3 మీటర్ల ఎత్తులో భారీ కట్ట నిర్మించడంతో, డ్రై ల్యాండ్‌గా ఉన్న ప్రాంతాల్లోకి నీళ్లు మళ్లించారని బాధితులు చెబుతున్నారు. ఈ నీరు సాధారణ వర్షపు నీరు కాకుండా, బాచుపల్లి…

Read More

కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహినుద్దీన్‌పై బీఆర్ఎస్ ఆరోపణలు – రిగ్గింగ్‌ ప్లాన్‌ చేసారన్న సంచలన ఆరోపణలు

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి చెలరేగుతోంది. ఈ క్రమంలో కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహినుద్దీన్‌పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎమ్మెల్యే మొహినుద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా రిగ్గింగ్‌ పథకం వేసారని ఆరోపించింది. బీఆర్ఎస్ నేతల ప్రకారం, జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌ నెంబర్లు 66, 67లో ప్రిసైడింగ్‌ అధికారులను బెదిరించి, బీఆర్ఎస్ ఏజెంట్‌ను మొహినుద్దీన్‌ బలవంతంగా బయటకు పంపించారని తెలిపారు. అంతేకాకుండా, గుర్తింపు కార్డులు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది….

Read More

జూబిలీహిల్స్ ఉపఎన్నిక జ్వరం: పరిపాలనపై అసంతృప్తి, బిఆర్ఎస్ – కాంగ్రెస్ – బిజెపి మధ్య త్రికోణ పోరు

జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడి మొదలైపోయింది. ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్థానంలో జరుగుతున్న ఈ ఎన్నికపై తెలంగాణ అంతా దృష్టి సారించింది. ఇప్పటికే కాంగ్రెస్ – బిఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించుకోగా, బిజెపి అభ్యర్థి కూడా త్వరలో ఖరారు కావొచ్చని సమాచారం. స్థానిక మోతీనగర్, బోరబండ, రెహమత్‌నగర్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకుంటే స్పష్టమైన రాజకీయ అసంతృప్తి మరియు కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వంపై మిశ్రమ అభిప్రాయం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా పెద్దగా అభివృద్ధి…

Read More

తెలంగాణలో వరదలు–పెద్దమనసు మాటలు vs ప్రభుత్వ నిర్లక్ష్యం: ప్రజల కేకలు ఎవరికి వినిపించాయి?

తెలంగాణలో వర్షాలు పడితే ప్రజల పరిస్థితి ఏమవుతోంది? ప్రభుత్వ బాధ్యత ఎక్కడ కనిపిస్తోంది? ఖమ్మం, మధిర, సూర్యాపేట, కొనిజర్ల మండలం, నెమ్మవాగు వంటి ప్రాంతాల్లో వరదలు తీవ్రమవుతుండగా, సాధారణ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కానీ ప్రభుత్వం చర్యలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. కొనిజర్ల మండలంలో నెమ్మవాగు వర్షంతో పొంగిపొర్లి ఓ డిసి‌ఎం డ్రైవర్ వరదలో కొట్టుకుపోయాడు. అక్కడ పోలీస్‌లు బారికేడ్‌లు పెట్టి ప్రజలకు హెచ్చరికలు ఇవ్వాల్సిన సమయంలో, ఎక్కడా వైద్య-పోలీస్-రెవెన్యూ యంత్రాంగం కనపడలేదు. స్థానిక ప్రజలే…

Read More

ఓబీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ అడ్డంకులు — రేవంత్ రెడ్డి కృషిని ప్రశంసించిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ఆమోదించింది. అయితే, ఆ బిల్లును భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అడ్డుపడుతున్నదని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు బిల్లును పాస్ చేయడమే కాకుండా, అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి మోదీ గారిని కలుసుకుందామని, పార్లమెంట్‌లో నైన్త్ షెడ్యూల్‌లో చేర్చాలన్న ప్రయత్నం చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సమయం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో,…

Read More

జూబ్లీ హిల్స్ లో యువత ఉత్సాహం – “నవీన్ అన్నే మా లీడర్” అంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉపఎన్నికలు వేడెక్కుతున్నాయి. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో “నవీన్ అన్నే మా లీడర్” అంటూ ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు స్పష్టంగా చెబుతున్నారు — “మా లీడర్ బెస్ట్ లీడర్, ఎడ్యుకేటెడ్ లీడర్ అంటే నవీన్ అన్నే. ఆయన అందరికీ దగ్గరగా ఉంటాడు, పనులు చేసి చూపిస్తాడు.” బిఆర్ఎస్ వైపు నుంచి “ఫేక్ ఓటర్ ఐడీస్” ప్రచారం జరుగుతున్నా, కాంగ్రెస్ వర్గాలు దాన్ని ఖండిస్తున్నాయి. ఒక కార్యకర్త మాట్లాడుతూ — “మనం రియాక్షన్…

Read More

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ పట్ల ప్రజా ఉత్సాహం — బంపర్ మెజారిటీ ఊహ

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పట్ల ప్రజల్లో అపారమైన మద్దతు కనిపిస్తోంది. ఆయన ర్యాలీల్లో లక్షల మంది పాల్గొంటున్నారని, ఈ ఉత్సాహం ఓట్లుగా మారబోతోందని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారం — “ఈసారి పార్టీ పరంగా కాదు, నవీన్ యాదవ్ వ్యక్తిత్వం చూసి ఓటేస్తాం” అని చెప్తున్నారు. కొంతమంది మాట్లాడుతూ, “టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పని అయిపోయింది. కేసీఆర్ మళ్లీ సభ పెట్టినా పరిస్థితి మారదు. నవీన్ యాదవ్ బంపర్ మెజారిటీతో…

Read More

షేక్‌పేట్ ప్రజల ఆవేదన – 15 ఏళ్లుగా పరిష్కారం లేని డ్రైనేజ్ సమస్యపై ఫిర్యాదులు ఫలించలేదు

హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట్ ప్రాంత ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చెబుతున్న ప్రకారం, వర్షం వచ్చినప్పుడల్లా నీరు ఇళ్లలోకి ప్రవేశించి జీవనాన్ని దెబ్బతీస్తోంది. డ్రైనేజ్ నీరు వీధులంతా వ్యాపించి దోమలు, రోగాలు విస్తరిస్తున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రజలు చెబుతున్న దాని ప్రకారం, “మేము చిన్నప్పటి నుంచే ఇక్కడే ఉంటున్నాం. ముప్పై సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం…

Read More