ప్రభాస్–మారుతీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ “ద రాజా సాబ్” పై అభిమానుల్లో మొదటి అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుంచే వేచి ఉన్నారు. అయితే పాట విడుదల తేదీ పలుమార్లు మారడం వల్ల సోషల్ మీడియాలో #WakeUpRajaSaab వంటి హాష్‌ట్యాగ్‌లు వరుసగా ట్రెండ్ అయ్యాయి.
మొదట ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించిన ఈ సాంగ్‌ను తర్వాత నవంబర్ మొదటి వారానికి మార్చినా, మళ్లీ ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. అయితే తాజా సమాచారంతో ఇప్పుడు ఆ నిరాశంతా తొలిగిపోయింది.
సమాచారం ప్రకారం ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ నవంబర్ 24న విడుదల కాబోతుంది.
ఈ విషయాన్ని టీమ్ ఈ వారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం వల్ల, టీమ్ ఈ నెలలోపలే ప్రమోషన్స్‌ను వేగంగా ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
దర్శకుడు మారుతీ, ప్రభాస్‌కి సరికొత్త స్క్రీన్పర్సోనాన్ని చూపించేందుకు ఈ సినిమాను ఫుల్ ఫన్‌తో కూడిన హారర్ కామెడీగా రూపొందిస్తున్నారు. బాహుబలి తర్వాత వరుసగా సీరియస్ యాక్షన్ చిత్రాల్లో నటించిన ప్రభాస్, ఈసారి తన కామెడీ యాంగిల్‌ను మళ్లీ చూపించబోతున్నాడు.
దర్శకుడు మారుతీ, ప్రభాస్‌కి సరికొత్త స్క్రీన్పర్సోనాన్ని చూపించేందుకు ఈ సినిమాను ఫుల్ ఫన్‌తో కూడిన హారర్ కామెడీగా రూపొందిస్తున్నారు. బాహుబలి తర్వాత వరుసగా సీరియస్ యాక్షన్ చిత్రాల్లో నటించిన ప్రభాస్, ఈసారి తన కామెడీ యాంగిల్‌ను మళ్లీ చూపించబోతున్నాడు.
సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశలో ఉంది.
క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ పూర్తయితే మొత్తం చిత్రీకరణ కూడా ముగిసినట్టే. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్లో కనిపించిన ప్రభాస్ డ్యూయల్ రోల్ హింట్ అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్లు సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు
ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ డేట్ లాక్ కావడంతో, “ద రాజా సాబ్” ప్రమోషన్స్ కొత్త ఉత్సాహంతో ప్రారంభమవ్వనున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఇది నిజంగా మిస్ అవ్వలేని మ్యూజికల్ ట్రీట్ కానుంది.

