బిగ్‌బాస్ సీజన్-9 డే-77 ఎపిసోడ్ మొత్తం తనూజ–ఇమ్మానుయేల్–దివ్య చుట్టూ తిరిగింది. ఈ వారం నామినేషన్స్‌లో భారీ డ్రామా, నో ఎలిమినేషన్ ట్విస్ట్, పవరాస్త్ర వినియోగం, హోస్ట్ నాగార్జున వేసిన వరుస ప్రశ్నలు — మొత్తం ఎపిసోడ్‌కి హైలైట్ అయ్యాయి.
తనూజ ఫోకస్‌నే కొనసాగిస్తున్న షో
ఎపిసోడ్ మొదటి నుండి చివరివరకు కూడా ఫోకస్ మళ్లీ తనూజపైనే.
ఆమె మాట్లాడినా, ఏడ్చినా, నవ్వినా, కోపంగా ఉన్నా — మొత్తం ఫుటేజ్ ఆమె చుట్టూ తిరుగుతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హోస్ట్ నాగార్జున కూడా:
- “తనూజ ఏమైనా చెప్పాలమ్మా?”
- “తనూజ ఏం జరిగింది చెప్పమ్మా?”
లాంటివే ఎక్కువగా మాట్లాడడంతో…
దివ్య మాట్లాడుతున్నపుడు మాత్రం వరుసగా ప్రశ్నలు వేసి ఆమె తప్పు చేసినట్టు చూపించే ప్రయత్నం చేశారనే విమర్శలు నెట్టింట పుట్టుకొచ్చాయి.
దీనితో సోషల్ మీడియాలో దివ్యకి భారీ సపోర్ట్, తనూజపై నెగెటివ్ కామెంట్స్ వెల్లువెత్తాయి
⚡ ఎలిమినేషన్ డ్రామా: పవరాస్త్ర వల్ల ట్విస్ట్
ఎలిమినేషన్ జోన్‌లో చివరికి సంజన–దివ్య మిగిలారు.
ఈ సమయంలో నాగార్జున ఇమ్మానుయేల్ చేతిలో ఉన్న పవరాస్త్ర మూడో పవర్‌ను వివరించారు.
🔸 పవర్-3:
ఈ వారం ఎలిమినేషన్‌ను పూర్తిగా రద్దు చేసే పవర్
ఇమ్మానుయేల్ అడిగాడు —
“సార్, నేను వాడితే నిజంగానే ఎలిమినేషన్ ఉండదా?”
నాగ్:
“అవును. వాడితే నో ఎలిమినేషన్.”
అలాగే ఆయన మధ్యలో మళ్లీ తనూజ గోల్డెన్ బజర్ ఉదాహరణ తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
🔸 చివరికి ఇమ్మానుయేల్ పవర్ ఉపయోగించాడు!
ఇందుకు నాగ్ వరుస ప్రశ్నలు వేయగా ఇమ్మూ ఇలా సమాధానమిచ్చాడు:
- “వాళ్లిద్దరూ ఒక వారం అదనంగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రావొచ్చు.”
- “పవర్ యూజ్ చేయకపోతే అయినా అది ఎక్స్‌పైర్ అయిపోతుంది.”
నాగార్జున ఇంకా ప్రశ్నలు వేసినా, ఇమ్మూ తన డెసిషన్‌పై నిలబడిపోయాడు.
➡️ ఫలితం: ఈ వారం ఎలిమినేషన్ రద్దు
😒 పవరాస్త్ర ఉపయోగం తర్వాత కూడా నాగ్ క్లాస్
పవర్ వాడిన వెంటనే కూడా నాగార్జున…
“ఇన్ని వారాలు వాళ్లు ప్రూవ్ చేసుకోలేదా?”
అని ఇమ్మూ నిర్ణయంపై నిలదీశారు.
తమ తమ అభిప్రాయాలు చెప్పిన భరణి, సుమన్ —
“పవరాస్త్ర అతనిది… డెసిషన్ అతనిదే.”
అని క్లారిటీ ఇచ్చారు.
అయినా నాగార్జున వరుసగా ఒత్తిడి చేసి, ప్రశ్నలతో ఇమ్మానుయేల్‌ను కష్టపెట్టారని నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు.
👀 తనూజ రియాక్షన్ — ఇమ్మూ, పవరాస్త్ర గురించిన మాటలు
ఇమ్మూ పవర్ వాడిన తర్వాత తనూజ ఏదో చెప్పింది.
దానికి ఇమ్మూ ఇలా సమాధానమిచ్చాడు:
“ఇప్పుడు వాడకపోతే పవర్స్ అన్నీ పోతాయి.”
తనూజ:
“దాచుకుని ఉంచితే టికెట్ టూ ఫినాలే లాంటి అవకాశం వచ్చేదేమో చూసుకోవాల్సింది.”
నాగార్జున వెంటనే క్లారిటీ ఇచ్చారు:
“లేదమ్మా… ఇది లాస్ట్ పవర్.”
🎉 అందుకే చివరికి — ఇద్దరూ సేఫ్
ఇమ్మూ పవర్ వాడడంతో సంజన–దివ్య ఇద్దరూ హౌస్‌లోకి తిరిగి వచ్చారు.
కానీ… ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు బయటకు వెళ్లాల్సివచ్చిందో చెబుదామని నాగార్జున చెప్పారు.
🔵 సంజన — గ్రీన్ (సేఫ్)
🔴 దివ్య — రెడ్ (ఎలిమినేట్ అయేది)
అంటే
➡️ ఇమ్మూ పవర్ వాడకపోయి ఉంటే దివ్య తిరిగి వెళ్లాల్సి వచ్చేది
🌸 ‘ముద్దు మందారం’ డైలాగ్‌కు హరిత కౌంటర్
కొన్ని వారాల క్రితం మర్యాద మనీష్ చేసిన
“ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతున్నారు”
అనే పంచ్ గుర్తుందా?
అదే ‘ముద్ద మందారం’ సీరియల్ టైటిల్‌తో తనూజపై వేసిన భారీ పంచ్.
ఈ వారం ఫ్యామిలీ వీక్‌లో తనూజ తరఫున వచ్చిన నటి హరిత,
ఆ డైలాగ్‌పై చాలా మర్యాదగా కానీ షార్ప్‌గా కౌంటర్ ఇచ్చింది.
తనూజ — హరిత — పవన్ సాయి ముగ్గురూ కలిసి
‘ముద్ద మందారం’ సీరియల్‌లో నటించారు.
హరితను తనూజ తల్లిలాగా ట్రీట్ చేస్తుందనేది హైలైట్ అయ్యింది.

