వేణు ఎల్లమ్మ సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. బలగం హిట్ అవ్వడంతో ఈసారి కాస్త భారీగా ఒక మంచి ఎమోషనల్ మూవీ అది కూడా డివోషనల్ టచ్ ఇచ్చే సినిమా చేయాలని అనుకున్నాడు వేణు యెల్దండి. ఐతే ఆ సినిమా హీరో విషయంలో ఇప్పటికీ ఒక స్పష్టత రాలేదు. ముందు హీరోగా నితిన్ పేరు వినిపించింది.. ఐతే కొన్ని కారణాల వల్ల నితిన్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నితిన్ ప్లేస్ లో శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా చాలామంది పేర్లు వినిపించాయి.
దేవి శ్రీ ప్రసాద్ హీరోగా.. రీసెంట్ గా దేవి శ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ తో హీరోగా చేస్తున్నాడని హడావిడి చేశారు. సినిమా హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా డి.ఎస్.పి అటెంప్ట్ చేయడానికి రెడీ అయ్యాడని అన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ దేవి శ్రీ ఎల్లమ్మ సినిమాకు కేవలం మ్యూజిక్ మాత్రమే ఇస్తున్నాడు హీరోగా చేయట్లేదని అంటున్నారు. ఎల్లమ్మ సినిమాలో లీడ్ యాక్టర్ ఎవరన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న గా మారింది. తన సినిమా కాస్టింగ్ విషయంలో దిల్ రాజు ఎప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తుంటారు. అలాంటిది ఈసారి మాత్రం ఎల్లమ్మ విషయంలో ఎందుకో సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. బలగం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వేణు రెండో సినిమాను పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తాడని అనుకుంటే ద్వితీయ విఘ్నం దాటేందుకు వేణుకి చాలా పరీక్షలో ఎదురవుతున్నట్టు ఉన్నాయి.
DSP కాదంటే ఎల్లమ్మలో హీరోగా ఎవరు.. డి.ఎస్.పి కాదంటే ఇంతకీ ఎల్లమ్మలో హీరోగా నటించేది ఎవరు. అసలు వేణు, దిల్ రాజు ఎల్లమ్మ గురించి ఏం థింక్ చేస్తున్నారు అన్నది అర్ధం కావట్లేదు. సినిమాలో హీరోయిన్ గా అయితే కీర్తి సురేష్ ఫిక్స్ అయ్యింది. ఆల్రెడీ విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ తో కీర్తి సురేష్ అలరించేందుకు వస్తుండగా ఆ సినిమాతో పాటు అదే బ్యానర్ లో రాబోతున్న ఎల్లమ్మ కోసం కూడా ఆమెనే తీసుకున్నారు. ఎల్లమ్మ సినిమా గురించి బయట జరుగుతున్న డిస్కషన్స్ మొదట్లో కాస్త క్రేజ్ తెచ్చుకున్నా ఇంకా ఇంకా అదే కన్ ఫ్యూజన్ కొనసాగడం వల్ల సినిమాపై ఉన్న పాజిటివిటీ కోల్పోతుందని చెప్పొచ్చు. మరి మేకర్స్ సాధ్యమైనంత వరకు సినిమా అప్డేట్స్ ఇచ్చి షూటింగ్ షురూ చేస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది. నితిన్ నుంచి దేవి శ్రీ ప్రసాద్ దాకా వచ్చిన ఎల్లమ్మ సినిమాలో హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే స్క్రిప్ట్ బాగా కుదరడంతో సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తీయాలన్న ప్లానింగ్ లో ఉన్నారు దిల్ రాజు. కానీ సినిమాకు ఎవరో ఒకరిని లీడ్ హీరోగా ఫిక్స్ చేసి స్టార్ట్ చేస్తే మళ్లీ ప్రమోషన్స్ తో సినిమాపై క్రేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.

