కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌కు ‘కూలీ’ సినిమా పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను నిరాశపరచడంతో లోకేష్ కెరీర్‌పై కొంత ఇంపాక్ట్ పడింది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో మరోసారి తన ఒరిజినాలిటీ చూపించాలని లోకేష్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
అసలైతే లోకేష్ దగ్గర అమీర్ ఖాన్ సినిమా, రజనీకాంత్ లేదా కమల్ హాసన్‌తో ప్రాజెక్ట్, కార్తితో ‘ఖైదీ 2’ వంటి పలు ఆప్షన్లు ఉన్నప్పటికీ… వీటికి అదనంగా ఇప్పుడు ఓ సూపర్ క్రేజీ కాంబినేషన్ లాక్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా.
‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్‌తో లోకేష్ కనకరాజ్ సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టేనని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారట. ‘విక్రం’ రిజల్ట్ చూసి లోకేష్‌పై నమ్మకంతోనే మైత్రి సంస్థ ఈ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక లోకేష్ కనకరాజ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. లోకేష్ స్టైల్‌లో అల్లు అర్జున్‌ను ఎలా చూపిస్తాడన్నదే ఇప్పుడు ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఖైదీ’, ‘విక్రం’ తరహా ఇంటెన్స్, రా క్యారెక్టర్‌లో పుష్ప హీరో కనిపిస్తాడా? లేక పూర్తిగా కొత్త షేడ్‌లో ప్రెజెంట్ చేస్తాడా? అన్న ఆసక్తి పెరుగుతోంది.
ఇదిలా ఉండగా, అట్లీ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథాలజీ సినిమా చేస్తాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ సినిమాకు భారీ ప్రీ-ప్రొడక్షన్ టైమ్ అవసరం కావడంతో, ఆ గ్యాప్‌లో లోకేష్ సినిమాను పూర్తి చేసే ప్లాన్‌లో బన్నీ ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి అట్లీ – లోకేష్ కనకరాజ్ – త్రివిక్రమ్… ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్లతో అల్లు అర్జున్ లైనప్ చూస్తే, రాబోయే రోజుల్లో ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ ఖాయమనే చెప్పాలి. లోకేష్ ‘పుష్ప’ను ఎలా డిజైన్ చేస్తాడన్నదే ఇప్పుడు అందరి చూపును ఆకర్షిస్తోంది.

