బుట్ట బొమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన పూజా హెగ్దే ప్రస్తుతం కెరీర్‌లో కీలక దశలో ఉంది. తెలుగులో కొంత గ్యాప్ వచ్చినా.. తమిళ్, హిందీ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్తోంది. రాధే శ్యాం తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు ముందే సైన్ చేసిన ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన పూజా, ఆ తర్వాత తెలుగులో పూర్తిగా కనుమరుగైంది. స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా పూజాను ఎంపిక చేయలేదు.
అయితే ఈ సమయంలో పూజా హెగ్దేకి తమిళ పరిశ్రమ అండగా నిలిచింది. సూర్యతో కలిసి ‘రెట్రో’ సినిమాలో నటించిన పూజా, ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా మరో రెండు అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం పూజా తమిళ్‌లో లారెన్స్‌తో కాంచన 4, దళపతి విజయ్‌తో జన నాయగన్ సినిమాల్లో నటిస్తోంది.
ఇవే కాకుండా చాలా కాలం తర్వాత తెలుగులో కూడా పూజా మళ్లీ ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా, రవి నెలకుడితి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.ఎల్.వి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజాకు తెలుగులో రీ–ఎంట్రీకి కీలకంగా మారనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
బాలీవుడ్‌లో కూడా పూజా బిజీగానే ఉంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న హై జవాని తో ఇష్క్ హోనా హై సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ కోసం ట్రై చేసినా, అక్కడ పెద్ద స్థాయి క్రేజ్ మాత్రం ఇంకా రాలేదనే చెప్పాలి.
ప్రస్తుతం పూజా హెగ్దే చేతిలో మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్‌తో కచ్చితంగా ఫామ్‌లోకి రావాలని ఆమె గట్టిగా ప్రయత్నిస్తోంది. పూజా థై షోకు ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “పూజా సినిమాలో ఉంటే గ్లామర్‌కు ఢోకా లేదు” అన్న మాట ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది.
ఇన్నాళ్లు సోషల్ మీడియా ఫోటోషూట్స్‌తో పాపులారిటీ నిలబెట్టుకున్న పూజా, ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టిందని చెబుతోంది. దుల్కర్ సల్మాన్ సినిమాతో తెలుగులో మళ్లీ సత్తా చాటాలని చూస్తున్న పూజా ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయన్నది చూడాలి.
అయితే అవకాశాలు ఉన్నా లేకపోయినా కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గించుకోకుండా, అవసరమైతే టైర్–2 హీరోలతోనైనా నటించేందుకు సిద్ధంగా ఉందంటోంది పూజా హెగ్దే. దుల్కర్ సినిమా తర్వాత మరో ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయని సమాచారం.

