క్రేజీ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’ కారణంగా ఆయనపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఓబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
న్యూ ఇయర్ సందర్భంగా సందీప్‌రెడ్డి వంగ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా… అందులో కనిపించిన ప్రభాస్ లుక్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఒళ్లంతా గాయాలు, బ్యాండేజీలు, లాంగ్ హెయిర్, సిగరెట్ వెలిగిస్తూ రా అండ్ రస్టిక్ లుక్‌లో ప్రభాస్ కనిపించడం సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటివరకు చూడని విధంగా ప్రభాస్ కనిపించడంతో ఇది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అవుతుందనే టాక్ మొదలైంది.
అయితే ఈ ఫస్ట్ లుక్‌తో పాటు నెట్టింట విమర్శల వర్షం కూడా అదే స్థాయిలో కురుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ నుంచి ఇప్పటివరకు సందీప్‌రెడ్డి వంగ ఒకే క్యారెక్టర్ టెంప్లెట్‌ని వాడుతున్నాడని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. రఫ్ హీరో, లాంగ్ హెయిర్, గడ్డం, ఆల్కహాలిక్, స్మోకర్, హింసాత్మక ప్రవర్తన, మేల్ డామినేషన్, ఫిమేల్ అబ్యూజింగ్ సన్నివేశాలు… ఇవన్నీ ఆయన సినిమాలకు కామన్ ఫీచర్స్‌గా మారాయని విమర్శలు వస్తున్నాయి.
ఇక ‘యానిమల్’ ఛాయలు ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్‌లో కూడా కనిపిస్తున్నాయంటూ, సందీప్ సినిమాలు ముందే ఊహించగలిగేలా ఉంటున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ తరహా టెంప్లెట్ ప్రేక్షకులను బోర్ కొట్టే ప్రమాదం ఉందని కొందరు క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే మరోవైపు సందీప్‌రెడ్డి వంగ అభిమానులు మాత్రం ఈ విమర్శలను పూర్తిగా తిప్పికొడుతున్నారు. సందీప్ తనదైన మార్క్ మేకింగ్‌తో ఇండియన్ సినిమాల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చాడని, పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్, ఇంటెన్స్ ఎమోషన్స్, స్ట్రాంగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడని వాదిస్తున్నారు. ఆయన సినిమాల్లో హింస, శృంగారం ఎక్కువగా ఉన్నా… వాటి వెనుక స్పష్టమైన కథ, బలమైన ఎమోషనల్ డ్రైవ్ ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
మూస బాలీవుడ్ ధోరణికి భిన్నంగా, తన సినిమాలతో ప్రేక్షకుల్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ అని అభిమానులు అంటున్నారు. స్టోరీ టెల్లింగ్ నుంచి క్యాస్టింగ్, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు ప్రతి విషయంలో పూర్తి ఇన్‌వాల్వ్‌మెంట్‌తో పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అందిస్తాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.
మొత్తానికి… ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్‌తో సందీప్‌రెడ్డి వంగ మరోసారి అదే టెంప్లెట్ వాడుతున్నాడా? లేక ఈసారి నిజంగానే కొత్త షాక్ ఇస్తాడా? అన్న ప్రశ్న నెట్టింట హాట్ డిబేట్‌గా మారింది. సినిమా రిలీజ్ వరకు ఈ చర్చ ఆగేలా కనిపించడం లేదు.

