స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్.ఎస్.ఎమ్.బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 2027 లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతున్నా.. ఇప్పటికీ అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. అయితే అభిమానుల నిరాశకు తెర దింపుతూ.. నవంబర్ 15 నుంచి వరుస అప్డేట్స్ వదులుతానని రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే.
హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ వేదికగా లక్షమంది సమక్షంలో #గ్లోబ్ ట్రోటర్ ను నవంబర్ 15న నిర్వహించబోతున్నారు. ఇక అప్పటినుంచి రోజుకు ఒక అప్డేట్ వదులుతానని రాజమౌళి తెలిపారు. కానీ అభిమానులను మళ్లీ వారం రోజులు వెయిట్ చేయించడం ఇష్టం లేక ఈరోజు ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రాజమౌళి. రాజమౌళి ట్వీట్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా షేర్ చేస్తూ.. స్మైల్, లవ్ ఎమోజీలను పంచుకున్నారు. ఇక చెప్పినట్టుగానే ఈరోజు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇందులో కుంభ అనే పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో రెండు కాళ్లు పనిచేయని వ్యక్తిగా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక పవర్ఫుల్ వీల్ చైర్ లో కూర్చున్నట్టు చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే ఒక్కొక్క అప్డేట్ వదులుకుంటూ వస్తానని చెప్పిన రాజమౌళి.. అందులో భాగంగానే మొదట పృథ్వీరాజ్ లుక్కును రిలీజ్ చేశారు.
ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా విషయానికి వస్తే.. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా దాదాపు విదేశాలలోనే షూటింగ్ జరుపుకుంటుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ అడవులలో ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం జరుపుకున్నట్లు సమాచారం. కెన్యాలో కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సుమారుగా 1200 కోట్ల బడ్జెట్తో ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు విషయానికి వస్తే.. ఇన్ని రోజులు టాలీవుడ్ విడిచి మరో భాషా చిత్రంలో నటించడానికి ఇష్టపడని మహేష్ బాబు.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

